KTR: గురుకులాల్లో విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్

అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు.

KTR: గురుకులాల్లో విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్

KTR

Updated On : November 26, 2024 / 5:22 PM IST

గురుకులాల్లో విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దాదాపు 42 మంది విద్యార్థులు మృతిచెందారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతుందా అని నిలదీశారు.

తాను సైకో అయితే మరి రేవంత్ శాడిస్టా అని కేటీఆర్ నిలదీశారు. శైలజ అంత్యక్రియలకు వెళ్లే తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. 31 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా గత తమ ప్రభుత్వం మైక్రో సాఫ్ట్ ను తీసుకొచ్చిందని అన్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి భారీ పెట్టుబడులను తెచ్చామని తెలిపారు. తాను బరా బర్ ఆదానీని కలిశానని, చీకట్లో కాళ్లు మాత్రం పట్టుకోలేదని అన్నారు.

“ఈ సీఎం ఆదానీ, అల్లుడు, అన్న కోసం పని చేస్తున్నారు. ఆదానీ చెక్కుపై అనుమానాలు ఉన్నాయి. అక్టోబర్ 14న చెక్కు ఇస్తే ఎందుకు పెండింగ్ లో ఉంచారు? వంద కోట్ల రూపాయల చెక్కు ఆదానీ ఇవ్వలేదు.

మీ ప్రభుత్వం డ్రా చేయలేదు ఇదంతా డ్రామా. ఆదానీ దొంగ అని నిన్ననే తెలిసిందా? కొడంగల్ అల్లుని కోసం అని అనుకున్నాం. అదానీ కోసం అని తెలిసింది. పాలసీ లేకుండా ప్రతిపాదనలు ఎలా తీసుకున్నారు? ఆదానీ దొంగ అని రాహుల్ ఎప్పటి నుంచో చెబుతున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Rajya Sabha seats: ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల