కేసీఆర్ ఆరోగ్యంపై ‘ఎక్స్’ వేదికగా కీలక విషయాన్ని వెల్లడించిన కేటీఆర్

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ‘ఎక్స్’ వేదికగా కీలక విషయాన్ని వెల్లడించిన కేటీఆర్

KCR Health Condition

Updated On : July 4, 2025 / 1:29 PM IST

KCR Health Condition: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో గురువారం ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. దీంతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. తాజాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు.

 

‘సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం సాయంత్రం కేసీఆర్ గారు ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు పర్యవేక్షించేందుకు కొన్నిరోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవు. వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కేసీఆర్ క్షేమం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఙతలు తెలుపుతున్నా.’’ అంటూ కేటీఆర్ పోస్టులో పేర్కొన్నారు.

కేసీఆర్ గురువారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. ఆయన్ను పరీక్షించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం కేసీఆర్‌కు చికిత్స అందిస్తోంది. కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేసీఆర్‌కు ఏమైంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో గురువారం రాత్రి ఆస్పత్రి వర్గాలు కేసీఆర్ హెల్త్ కండీషన్ పై బులిటెన్ విడుదల చేశాయి. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, నీరసంతో బాధపడుతూ ఆయన ఆస్పత్రిలో చేరారని, వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తాజాగా.. కేటీఆర్ ట్విటర్ వేదికగా కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరడం జరిగిందని చెప్పారు.