KTR: ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలో వచ్చిన కేటీఆర్.. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆటోలో వచ్చారంటూ విమర్శలు

రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఆటోలో వచ్చి సమస్యలు అన్నీ తీర్చుతామని అన్నారని చెప్పారు.

KTR: ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలో వచ్చిన కేటీఆర్.. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆటోలో వచ్చారంటూ విమర్శలు

Updated On : November 5, 2024 / 3:32 PM IST

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సర్వీసుల కారణంగా నష్టపోతున్న తమను సర్కారు ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలో వచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

కొంతమంది ఈఎంఐలు, ఇంటి కిరాయిలు కట్టుకునే పరిస్థితి లేదంటున్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఉండే ఆరున్నర లక్షల మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఆటోలో వచ్చి సమస్యలు అన్నీ తీర్చుతామని అన్నారని చెప్పారు.

నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని అన్నారని కేటీఆర్ తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారని, వాటిని అమలు చేయట్లేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటో ఆలోచించుకోవాలని అన్నారు. కాగా, తెలంగాణ సర్కారు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అది అమలు చేయాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

వీటిపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్‌ గాంధీకి ఉందా?: బండి సంజయ్