వీటిపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్‌ గాంధీకి ఉందా?: బండి సంజయ్

ఏం సాధించానని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోందని బండి సంజయ్ నిలదీశారు.

వీటిపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్‌ గాంధీకి ఉందా?: బండి సంజయ్

Bandi Sanjay Kumar

Updated On : November 5, 2024 / 2:01 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఇచ్చిన 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఏం సాధించానని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోందని బండి సంజయ్ నిలదీశారు. ఇటువంటి పనులు చేయడంలో కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ మించిపోయిందని అన్నారు. మాజీ సర్పంచుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన చేస్తుండడం సిగ్గు చేటని, చంపినోడే సంతాప సభ పెట్టినట్లుందని విమర్శించారు.

కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం చేపడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 15 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకోవడమేంటని నిలదీశారు. శంషాబాద్‌లో ఆంజనేయస్వామి ఆలయంపై దాడి అమానుషమని చెప్పారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని అన్నారు. హిందువులంతా రోడ్డెక్కే పరిస్థితి కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు.. ఏమన్నారంటే?