పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు.. ఏమన్నారంటే?
సైబర్ క్రైం, సోషల్ మీడియా వేదింపులు ఎక్కువయ్యాయన్న డీజీపీ.. వీటిపై పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు

DGP Dwaraka Tirumala Rao
DGP Dwaraka Tirumala Rao: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం పర్యటన సమయంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలి.. మేము చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయి. టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నేరస్తుల వేలిముద్రలు గుర్తించే సిస్టం లేకుండా చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది చూడాలని డీజీపీ అన్నారు. ఒక ఎంపీని కొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై నిజానిజాలు తేలలేదని పేర్కొన్నారు.
Also Read: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..
ఇటీవల సైబర్ క్రైం, సోషల్ మీడియా వేదింపులు ఎక్కువయ్యాయన్న డీజీపీ.. వీటిపై పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చట్టానికి రాజ్యాంగానికి లోబడే మేము పనిచేస్తున్నాం. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అని డీజీపీ తిరుమల రావు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయం.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తాం. ఎవరికి ఎంత ప్రోటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. డీజీపీ ఆఫీసులో సంతకాలు చేస్తున్న వారిలో 10మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చాం. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ తిరుమల రావు పేర్కొన్నారు.