Telangana Rains : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు!
పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Telangana Rains
Southwest Monsoon : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురువనున్నాయి. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర – దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది.
పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీలో వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ
శుక్రవారం వాతావరణం పొడిగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు కావచ్చని పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, బుధవారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్ లో 42.2, నల్గొండ, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో 42 డిగ్రీలు, మెదక్ 41.2, మహబూబ్ నగర్ లో 39.9, భద్రాచలంలో 39.4, హైదరాబాద్ లో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.