Andhra Pradesh: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

Andhra Pradesh: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ

Rain Alert

Updated On : May 25, 2023 / 11:27 AM IST

Andhra Pradesh – Weather Forecast: ఆంధ్రప్రదేశ్ (AP) లోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ తదితర ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

పల్నాడు జిల్లాలోని అమరావతి, అచ్చంపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.

అలాగే, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు. మే నెలలో పడుతున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు, మే నెలలో పలు ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉంటున్నాయి.

Mahanadu: మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలు.. ఎన్నికల వేళ ఉత్కంఠ