Telangana Localbody Elections: సర్పంచ్ ఎన్నికల్లో టార్గెట్ ‘కోతులు’…
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపుకోసం ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా..

Monkeys
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో గ్రామాలవారీగా వార్డులకు, మండలాల వారిగా సర్పంచ్ లకు, ఎంపీటీసీ స్థానాలకు, జిల్లాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు పార్టీల వారీగా ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే .. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను కోతులే డిసైడ్ చేసే పరిస్థితి నెలకొంది. గత సర్పంచ్ ఎన్నికల్లో పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొనగా.. ప్రస్తుతం అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇంతకీ.. కోతులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం ఏమిటంటే..
Also Read: Rangarajan: రంగరాజన్ మీద దాడి చేసింది ఇందుకే.. సంచలన విషయాలు వెలుగులోకి..
గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో అభ్యర్థులు గెలుపుకోసం అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య ఇలా పలు సమస్యలను పరిష్కారం చేస్తామంటూ గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ, పలు గ్రామాల్లో కోతుల బెడద తీర్చేవారికే ఓట్లేస్తామని ప్రజలు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చి భారీ మెజార్టీతో గెలిచిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉన్నారు. అయితే, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి గ్రామాల సంఖ్య పెరిగిందనే చెప్పొచ్చు.
Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీగా..
రాష్ట్రంలో 35లక్షలకుపైగా కోతులు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా జనావాసాల్లో ఎటు చూసినా కోతులే కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో కోతల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు సందర్భాల్లో కోతులు ఇండ్లలోని వారిపైనా దాడులు చేస్తున్నాయి. మరోవైపు రైతులు సాగుచేసిన పంటలనుసైతం కోతులు ఆగం చేస్తున్నాయి. వీటి నివారణకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు కోతుల బెడదను తొలగించేవారికే తమ ఓటు అంటూ ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. పలు గ్రామాల్లో అయితే.. గ్రామస్తులంతా కలిసి తీర్మానాలుసైతం చేస్తున్న పరిస్థితి. దీంతో పలు పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు తొలుత కోతుల సమస్యను పరిష్కరించే విషయంపై దృష్టిసారించి ప్రజల వద్దకు ఓట్లకోసం వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది.