Lockdown : తెలంగాణాలో లాక్ డౌన్, ఇళ్లల్లో ప్రజలు..రోడ్లు నిర్మానుష్యం

Hyd lock down
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
దీంతో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను తెచ్చుకొనేందుకు జనాలు రోడ్ల మీదకు వచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రజలతో రద్దీగా మారింది. అనంతరం 10 గంటల అనంతరం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో వీధులు బోసిపోయాయి. పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై ఉన్న వారిని మందలించి పంపించి వేశారు. అత్యవసరం..అనుమతి ఉన్న వారు మాత్రమే రోడ్లపైకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
రైతులు, ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వదిలిపెడుతున్నారు. బ్యాంకింగ్, మీడియా, వ్యవసాయం వంటి రంగాలకు చెందిన వారు ఐడీ కార్డులు, అనుమతి పత్రాలు చూపెడితే వారిని వదులుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్న వారికి అనుమతి ఇస్తున్నారు. కేవలం అనుమతులున్న వారిని మాత్రమే పోలీసులు అనుమతినిస్తున్నారు.
Read More : Love : ప్రియుడి కోసం తల్లిని చంపేసింది..