DK Aruna : ఆమె ఇదే నేర్పిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

లక్కీ డీప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది. అధికారం, అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకుకూడా ప్రజలే బుద్ధి చెప్తారు.

DK Aruna : ఆమె ఇదే నేర్పిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

DK Aruna

DK Aruna Counter To CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా మహిళనైన నన్ను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం. 46తో పాలమూరు జిల్లా యువత ఉద్యోగాలు నష్టపోతున్నారు. తక్షణమే జీవోను రద్దుచేసి గ్రామీణ ప్రాంతం యువతకు న్యాయం చేయాలని డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేసి ఖాళీలు పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పారు.. 40వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read : MLC Kavitha : నో బెయిల్.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు

ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి మళ్లీ ఆన్ లైన్ లో నిర్వహించారు. పరీక్ష ఫీజు పెంచి ఉద్యోగార్దులపై భారం వేస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. మహిళనైన నన్ను దూషిస్తున్నారు. నన్ను అవమానిస్తుంటే మీ విలువ పెరగడం లేదు.. దిగజారుతోందని తెలుసుకో రేవంత్ రెడ్డి అంటూ డీకే అరుణ సూచించారు. అరుణమ్మ కల్తీ రక్తం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ సోనియా గాంధీ ఇదే నేర్పిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

Also Read : Jharkhand : ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు.. మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

రేవంత్ రెడ్డి ఎవరి పక్షాన పోరాటం చేయలేదు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు. లక్కీ డీప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది. అధికారం, అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకుకూడా ప్రజలే బుద్ధి చెప్తారు. బూతు మాటలు మాట్లాడే వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడంటే సిగ్గవుతోంది. దశాబ్దాల పాటు జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన కుటుంబం మాది. ప్రధాని మోదీని తిట్టడంఅంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లేనని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని డీకే అరుణ అన్నారు.