పెళ్లికి పెద్దలు అంగీకరించరని పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు అంగీకరించరని పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

Updated On : December 19, 2020 / 1:56 PM IST

Love couple commit suicide : తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్, అనూషలు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అనూష మైనర్ కావడంతో తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే భయంతో వీరిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

శేఖర్ (23), అనూష (16) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరివి కులాలు వేర్వేరు కావడం, పెద్దలు ప్రేమ పెళ్లికి నిరాకరిస్తారని మనస్తాపం చెందారు. ప్రేమ విఫలం అవుతుందనే భయంతో నిన్న సాయంత్రం అటవీప్రాంతంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

స్థానికులు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.