Bay Of Bengal : రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం…భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 29, 30 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Bay Of Bengal : రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం…భారీ వర్షాలు కురిసే అవకాశం

Bay Of Bangal (1)

Updated On : October 27, 2021 / 8:20 AM IST

Low pressure in Bay of Bengal : బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం సముద్రమట్టానికి 3.1కి లోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించవచ్చని తెలిపింది.

దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం, 29, 30 తేదీల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Suicide Attempt : నీలోఫర్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపింది.