Mahender Reddy: తహశీల్దార్ ఇంట్లో రూ.2 కోట్ల కరెన్సీ, భారీగా బంగారం
మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు కనపడ్డాయి. అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Mahender Reddy
ACB Raids: హైదరాబాద్‌లోని మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో అవినీతి వ్యతిరేక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ వెతుకుతున్న కొద్దీ డబ్బు కనపడుతోంది.
మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. భారీగా నగదుతో పాటు బంగారం కూడా కనపడింది. మహేందర్ రెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మహేందర్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయం సహా 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
మహేందర్ రెడ్డి కొన్ని వారాల క్రితమే కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి బదిలీ అయి వచ్చారు. ఆయన ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు బంగారంతో పాటు దాదాపు రూ.2 కోట్ల కరెన్సీ బటయపడినట్లు సమాచారం.