చట్టం తెచ్చి అధికారికంగా ఇదే విగ్రహం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్
డిసెంబర్ 9 తెలంగాణలో చారిత్రక రోజని, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభించారని గుర్తుచేశారు.

Mahesh Kumar Goud
తెలంగాణ సాధించుకుని 11 సంవత్సరాలు గడిచిందని, తెలంగాణ తల్లిని ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాది లోపే ముఖ్యమంత్రి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.
గత పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. నిజమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తాము ఏర్పాటు చేశామని అన్నారు. చట్టం తెచ్చి అధికారికంగా ఇదే విగ్రహం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
డిసెంబర్ 9 తెలంగాణలో చారిత్రక రోజని, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభించారని గుర్తుచేశారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు.
పదేళ్లలో తెలంగాణలో ఎలాంటి పరిపాలన జరిగిందో చూశామని చెప్పారు. పదేళ్ల విధ్వంస పాలన నుంచి పునరుద్ధరణ వైపు తెలంగాణ నడుస్తోందని తెలిపారు. పదేళ్లలో చేయనివి ఏడాదిలో చేసి చూపామని చెప్పుకొచ్చారు. ఈ రోజు పార్టీలకు ఆతీతంగా అందరూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరుతున్నానని తెలిపారు.
ఈ తేదీల్లో ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నాం: బొత్స సత్యనారాయణ