Mallu Ravi: పొంగులేటి నిర్వహించనున్న ప్రెస్ మీట్‌పై జూపల్లితో చర్చించా: కాంగ్రెస్ నేత మల్లు రవి

సోమ, మంగళ, బుధ వారాల్లో ఏదైనా ఒకరోజు ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు.

Mallu Ravi: పొంగులేటి నిర్వహించనున్న ప్రెస్ మీట్‌పై జూపల్లితో చర్చించా: కాంగ్రెస్ నేత మల్లు రవి

Mallu Ravi

Updated On : June 10, 2023 / 8:29 PM IST

Mallu Ravi – Ponguleti : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఏ పార్టీలో చేరతారన్న విషయంపై ఈ నెల 12న మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేయనున్నారు. ఆయన కాంగ్రెస్ (Congress) లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు.

పొంగులేటి నిర్వహించనున్న మీడియా సమావేశంపై జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తో చర్చించానని మల్లు రవి అన్నారు. సోమ, మంగళ, బుధ వారాల్లో ఏదైనా ఒకరోజు ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. జూపల్లి కూడా తనను కలిశారని చెప్పారు.

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. అందరం ఒకేతాటిపైకి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డితోనూ మాట్లాడతామని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూసుకుళ్ల దామోదర రెడ్డి మాట్లాడుతూ… నాగంతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని అన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీతో కాకుండా స్థానికంగానే సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. తాను నాగంతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

JP Nadda: ఏపీ రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారన్న నడ్డా.. సీఎంగా ఉన్నప్పుడు తానేం చేశారో చెప్పిన నల్లారి కిరణ్