LPG prices: ఇండియా దమ్ము అంటే ఇదీ అంటూ మమత.. భావోద్వేగాలతో ఆడుకోవడమేనంటూ కవిత ట్వీట్లు

ఇప్పటివరకు ఇండియా కూటమి రెండు నెలల్లో కేవలం రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించిందని మమతా బెనర్జీ అన్నారు.

LPG prices: ఇండియా దమ్ము అంటే ఇదీ అంటూ మమత.. భావోద్వేగాలతో ఆడుకోవడమేనంటూ కవిత ట్వీట్లు

Mamata Banerjee and Kavitha

Updated On : August 29, 2023 / 8:31 PM IST

LPG prices – Mamata Banerjee : ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. కేంద్ర సర్కారు ప్రతిపక్షాల కూటమికి భయపడి ధరలను తగ్గించారని మమతా అన్నారు. కేంద్ర సర్కారు మాయ చేస్తోందని కవిత విమర్శించారు.

‘ ఇప్పటివరకు ఇండియా కూటమి రెండు నెలల్లో కేవలం రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించింది. దీంతో, ఇప్పుడు కేంద్ర సర్కారు ఎల్పీజీ ధరలను రూ.200 తగ్గించింది. ఇండియా దమ్మంటే ఇది ’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

‘ మొదట బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్ పై రూ.800 పెంచింది. ఇప్పుడు రూ.200 తగ్గించింది. ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసే దగా… వారి భావోద్వేగాలతో ఆడుకోవడమే ’ అని కవిత అన్నారు.

YS Sharmila: నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోరా?: షర్మిల