YS Sharmila: నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోరా?: షర్మిల
అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా?

YS Sharmila
YS Sharmila – Ts Dsc 2023: భావి తరానికి పాఠాలు నేర్పే టీచర్ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న అభ్యర్థులపై తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కేవలం 5 వేల పోస్టుల భర్తీకే డీఎస్సీ ప్రకటించడమేంటని ప్రశ్నించారు.
‘ అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా? సిగ్గుందా కేసీఆర్? నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా? ఎన్నికల ముందు కూడా మాట మీద నిలబడవా? కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు నీకెక్కడిది?
ఇచ్చిన మాట నిలబెట్టుకాకుండా యువత రక్తాన్ని కండ్ల చూస్తావా? నీ కుటుంబానికి ఐదు ఉద్యోగాలుంటే సరిపోతుందా? 13,096 టీచర్ పోస్టులకు ముష్టి 5 వేలు బిక్షం వేస్తావా? తొమ్మిదేళ్లుగా టీచర్ పోస్టుల ఊసే ఎత్తకుండా నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి, ఓట్లు దండుకుందామనా?
మాట తప్పితే తల నరుక్కునే నైజమే అయితే? నరం మీద నాలుకే ఉంటే 13086 టీచర్ పోస్టులకు కేసీఆర్ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ’ అని షర్మిల డిమాండ్ చేశారు.
KA Paul : తగ్గేదేలే అంటున్న కేఏ పాల్.. ప్రధాని మోదీ మాట్లాడే వరకు దీక్ష విరమించేది లేదని ప్రకటన