Tragedy In Bhainsa : స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతు
నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నెలకొంది. స్నే హితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.

Man Lost
man lost stream : నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నెలకొంది. స్నే హితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
భైంసా మండలం మాటేగామ్ గ్రామానికి చెందిన దాసు ప్రాణ స్నేహితుడు గిరి అనారోగ్యంతో నిన్న చనిపోయారు. అతని అంత్యక్రియలకు దాసు వెళ్లాడు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానం కోసం వాగులోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు.
వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయాడు. బయటకు రావడానికి దాసు శతవిధాల ప్రయత్నించాడు. అయినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. గల్లంతైన దాసు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా దాసుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.