KCR Cutout: కేసీఆర్ కటౌట్‌కి నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద కలకలం..
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

KCR Cutout: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ స్వల్పంగా కాలింది.
Also Read: రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఎందుకు యత్నించారో ఆరా తీశారు. కాగా, కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడిని తిరుపతి ప్రాంతానికి చెందిన రాజాగా గుర్తించారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here