మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ మళ్లీ ఫిర్యాదు
అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

సినీనటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. మరోసారి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ వెళ్లారు.
రాత్రి తన స్నేహితులతో కలిసి జలపల్లి నివాసంలో మనోజ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి విద్యుత్ సరఫరా కోసం బయట నుంచి జనరేటర్లను తెప్పించారు. పార్టీ ఏర్పాటుతో మంచు విష్ణు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో జనరేటర్ లోకి విష్ణు తన మనుషులతో పంచదార వేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన మంచు మనోజ్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది.
అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ మరోసారి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే శాంతి భద్రతలకు విగాధం కలిగించవద్దంటూ ఇద్దరితో బాండ్ రాయించుకున్నారు సీపీ. దీంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది మంచు ఫ్యామిలీ వివాదం.