Manchirevula Farmhouse : అమ్మాయిలను సరఫరా చేసేవాడు..బడా బాబులను రష్యాకు పంపేవాడు!

మంచిరేవుల పేకాట కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ విషయంలో ఖంగుతినే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Manchirevula Farmhouse : అమ్మాయిలను సరఫరా చేసేవాడు..బడా బాబులను రష్యాకు పంపేవాడు!

Gambling

Updated On : November 4, 2021 / 12:47 PM IST

Gutta Suman : మంచిరేవుల పేకాట కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ విషయంలో ఖంగుతినే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కర్నాటక, బెంగళూరు, హైదరాబాద్, ఒడిస్సా లాంటి ప్రాంతాల్లో పేకాట, కేసినో గేమింగ్ నిర్వహించినట్లు గుర్తించారు. ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇతను రియల్ ఎస్టేట్ పేరిట పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించాడని తెలుస్తోంది. పేకాట, కేసినో గేమింగ్ కొరకు బడా బాబులను రష్యా దేశానికి కూడా తీసుకెళ్లాడని విచారణలో తేలింది. అమ్మాయిలను కూడా సరఫరా చేసేవాడని సమచారాం. రష్యా దేశానికి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ తో అన్నీ గుత్తా సుమన్ చూసుకొనే వాడని నిర్ధారించారు. సంవత్సరంలో రెండు..మూడు సార్లైనా ప్రముఖులను రష్యాకి తీసుకెళ్లే వాడని తెలుస్తోంది.

Read More : Deepavali Village : ఆ ఊరే ‘దీపావళి’.. ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?

పేకాట కేసు రిమాండ్ రిపోర్టులో కూడా గుత్తా సుమన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. గుత్తా సుమన్ చాలా ఏళ్లుగా క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాకీలకు చిక్కకుండా స్టార్‌ హోటళ్లు, ఫాంహౌసులను అడ్డాగా చేసుకుని పత్తాలాడుతున్నట్లు తేల్చారు. గత ఆర్నెల్ల నుంచి ఈ దందా నడిపిస్తున్నాడు గుత్తా సుమన్‌. మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో క్యాసినోలు రన్‌ చేస్తున్నాడు. గతంలో ప్రముఖులతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టి… ఫాలోయింగ్ పెంచుకునే వాడని పోలీసులు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సంబంధాలున్నాయని బుకాయించి… కస్టమర్లకు ముగ్గులోకి దించేవాడు.

Read More : Chittur : దత్తత తీసుకున్న అమ్మాయి నీట్‌లో గ్రేట్, మురిసిపోయిన ఎమ్మెల్యే రోజా

వందలు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఆటలు నడిపాడు. లక్షలు పెట్టి ఆడే స్థోమత ఉన్న వాళ్లనే సెలెక్ట్‌ చేసుకున్నాడు. వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేశాడు. పేకాట జరిగే లొకేషన్‌ను వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసేవాడు. పేకాట నిర్వహించేందుకు టెక్నాలజీని ఫుల్‌గా వాడుకున్నాడు గుత్తా సుమన్‌. డబ్బు చేతికి తీసుకునే వాడు కాదు. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ డిపాజిట్‌ చేయించుకుని… కస్టమర్లకు కాయిన్ల రూపంలో ఇచ్చేవాడు. ఒక్కో కాయిన్‌ విలువ వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఉండేది.

Read More : Deepavali : అమెరికాలో దీపావళి బిల్లు.. పండుగ పూట సెలవు కోసం

ప్రతి సిట్టింగ్‌లో కోట్లల్లో గేమ్స్‌ నడిపించేవాడు. అయితే కేవలం ఉదయం పూట మాత్రమే ఆటలు నిర్వహించేవాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. పక్కా సమాచారంతో నార్సింగ్‌లో తనిఖీ చేసిన పోలీసులకు ఈ గ్యాంగ్ చిక్కింది. మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. ఉప్పరపల్లి కోర్టు.. నిందితులకు ఈ నెల 15వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. గుత్తా సుమన్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు.. మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.