Manda Krishna Madiga : ఎస్సీ వర్గీకరణపై మరోసారి మందకృష్ణ మాదిగ పాదయాత్ర, అక్టోబర్ 4 నుంచి ప్రారంభం

రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి. కానీ అమలు చెయ్యడం లేదు. సుప్రీంకోర్టు న్యాయం చేయాలి. Manda Krishna Madiga

Manda Krishna Madiga : ఎస్సీ వర్గీకరణపై మరోసారి మందకృష్ణ మాదిగ పాదయాత్ర, అక్టోబర్ 4 నుంచి ప్రారంభం

Manda Krishna Madiga (Photo : Google)

Updated On : September 25, 2023 / 5:48 PM IST

Manda Krishna Madiga – SC Classification : ఎస్సీ వర్గీకరణపై మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. అక్టోబర్ 4న అలంపూర్ నుంచి మాగిగల విశ్వరూప పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్ర ముగింపుగా హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ” ఎస్సీ వర్గీకరణ కోసమే మా పోరాటం. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. ప్రధాని హామీ ఇచ్చినపుడు కిషన్ రెడ్డి సాక్ష్యం. కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టడం లేదు.

Also Read..Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై

రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి. కానీ అమలు చెయ్యడం లేదు. కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది కానీ ప్రధానికి లేఖ ఎందుకు రాయదు? ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. మాదిగలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు న్యాయం చేయాలి. రిజర్వేషన్లు లేకుండా చాలా కులాలు ఇంకా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలకంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ జరపాలి. బీజేపీ కేవలం హామీలు మాత్రమే ఇస్తోంది. అసలైన దోషి బీజేపీనే. బీజేపీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యమయ్యేంత వరకు మా పోరాటం ఆగదు” అని మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు.

Also Read..YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?