Trains Cancelled: ఆ రెండు డివిజన్ల పరిధిలో 20 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ .. ఏ తేదీ వరకు అంటే?
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Trains Cancelled
Trains Cancelled: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రెండు డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 18 రైళ్లు ఈనెల 14వ తేదీ నుంచి 20వరకు రద్దు చేయగా.. రెండు రైళ్లు 15వ తేదీ నుంచి 21 వరకు రద్దు చేయడం జరిగిందని రైల్వే శాఖ తెలిపింది.
రద్దయిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే.. కాజేపీట – డోర్నల్ – కాజీపేట, డోర్నకల్ – విజయవాడ – డోర్నల్, భద్రాచలం రోడ్ – విజయవాడ – భద్రాచలం రోడ్, కాజీపేట – సిర్పుర్ టౌన్, బళ్లార్ష – కాజీపేట, భద్రాచలం రోడ్ – బళార్ష, సిర్పుర్ టౌన్ – భద్రాచలం రోడ్, సికింద్రాబాద్ – వరంగల్ – సికింద్రాబాద్, సిర్పుర్ టౌన్ – సికింద్రాబాద్ – సిర్పుర్ టౌన్, కరీంనగర్ – నిజామాబాద్ – కరీంనగర్, కాజీపేట – బళ్లార్ష – కాజీపేట, కాచిగూడ – నిజామాబాద్ – కాచిగూడ రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్లలో ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో 22 ఎంఎంటీఎస్ రైళ్లనుకూడా 14 నుంచి 20వ తేదీవరకు రద్దు చేశారు.
ఇదిలాఉంటే తమిళనాడులో వెలన్‌కన్ని పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడపనుంది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
08 Special Trains for #Velankanni Festival @drmsecunderabad @drmhyb @drmgnt @drmvijayawada pic.twitter.com/2Nundz1uRR
— South Central Railway (@SCRailwayIndia) August 12, 2023