కరెంట్‌ కోతలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి లేఖ

కరెంట్‌ కోతలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి లేఖ

Updated On : March 5, 2021 / 4:54 PM IST

Mayor Vijayalakshmi’s letter to GHMC Commissioner : కరెంట్‌ కోతలపై మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. కరెంట్‌ కోతలతో క్యాంప్‌ ఆఫీస్‌లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్‌ తెలిపారు. అంతేకాకుండా వరుస కరెంట్‌ కోతలతో పనులు వాయిదా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర 25 కెవి జనరేటర్‌ ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓ వైపు 24 గంటలు విద్యుత్‌ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. కరెంట్ కోతలపై మేయర్‌ విజయలక్ష్మి స్వయంగా లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది.