Mayor Gadwal Vijayalaxmi : హైదరాబాద్ లో రూ.60 కోట్ల విలువైన పార్క్ స్థలం కబ్జా.. జీహెచ్ఎంసీ మేయర్ సీరియస్..
ఇంత విలువైన స్థలం ఏ విధంగా కబ్జాకు గురవుతుందని మేయర్ మండిపడ్డారు.

Mayor Gadwal Vijayalaxmi : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పార్క్ స్థలం ఆక్రమణపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుకన్న 2వేల గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను పట్టించుకోలేదంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. 60 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు.
నగరంలోని విలువైన ప్రభుత్వ భూములు కబ్జా..
హైదరాబాద్ నగరంలో చాలా విలువైన ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ రెగులర్ గా మెయింటైన్ చేస్తున్న పార్క్ స్థలం కబ్జా కావడంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఏరియాకు చెందిన టౌన్ ప్లానింగ్, డిప్యూటీ కమిషనర్ తో పాటు పార్క్ ల నిర్వహణ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత విలువైన స్థలం ఏ విధంగా కబ్జాకు గురవుతుందని మేయర్ మండిపడ్డారు.
Also Read : అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని సీరియస్..
బయటి వ్యక్తులు లోపలికి వచ్చి పార్క్ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంటే.. మీరే చేస్తున్నారు? అంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. దాదాపు 2వేల గజాల స్థలం అది. దాని విలువ 60 కోట్లుగా చెబుతున్నారు. వెంటనే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు మేయర్. అక్రమంగా చేసిన నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.
అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశాలు..
సిటీలో అనేక ప్రాంతాల్లో పార్క్ లు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రాను తీసుకొచ్చింది ప్రభుత్వం. చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారు. ఇక, జూబ్లీహిల్స్ లోని పార్క్ స్థలం కబ్జా అంశంపై మీడియాలో కథనాలు రావడంతో జీహెచ్ఎంసీ మేయర్ రంగంలోకి దిగారు. నేరుగా వెళ్లి పార్క్ స్థలాన్ని పరిశీలించారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో పార్క్ ను డెవలప్ చేయాలని కూడా చెప్పారు.
Also Read : జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఫొటో వైరల్