Young Lady Suicide: ఈఎస్ఐ మెట్రొ స్టేషన్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది

Sr Nagar
Young Lady Suicide: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యకు పాల్పడిందని మొదట భావించినా కారణాలు వేరే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన యువతి ఎంబీఏ చదువుతుంది. యువతి తండ్రి సంజయ్ నగర్ లో ఆటో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. యువతి తరచూ మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తుండడంపై తల్లిదండ్రులు మందలించారు.
Also Read:Ts Cets 2022 : నేటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణా ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ 2022 దరఖాస్తులు
దీంతో మనస్తాపానికి గురైన యువతి..మంగళవారం ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకింది. కొనఊపిరితో ఉన్న యువతిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా స్టేషన్ పై నుంచి యువతి దూకడం గమనించిన స్థానికులు ఆమెను వారించే ప్రయత్నం చేసినా లెక్కచేయని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సబ్యులకు అప్పగించారు పోలీసులు.