“సాయంత్రంలోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి” అంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్
రఘనందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ప్రోగ్రాంకు హాజరయ్యారు.

BJP MP Raghunandan
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. “ఇవాళ సాయంత్రంలోగా నిన్ను లేపేస్తాం” అని ఫోనులో ఒక వ్యక్తి బెదిరించాడు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని ఆ అగంతకుడు ఫోనులో చెప్పాడు. +912143352974 నంబర్ నుంచి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
దమ్ముంటే కాపాడుకోండి అంటూ ఆ వ్యక్తి సవాలు విసిరాడు. డీజీపీ, సంగారెడ్డి ఎస్పీకి ఫోనులో ఎంపీ రఘునందన్ రావు సమాచారం అందించారు. రఘనందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్‌ను రఘునందన్‌రావు పీఏ లిఫ్ట్ చేసి మాట్లాడారు.
కాగా, వానాకాలంలోనూ ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు ఆగబోవని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టులమని చెప్పుకుంటూ బెదిరింపు కాల్ రావడం గమనార్హం.
Also Read: రూ.3.37 కోట్లు మోసపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. మహిళ పేరుతో ఆయనను ఎలా నమ్మించారంటే?