Medchal Ex MLA KLR : టీపీసీసీ చీఫ్ గా రేవంత్, మొదటి వికెట్..కేఎల్ఆర్ రాజీనామా
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన కాసేపటికే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనా చేయడం విశేషం.

Klr
Medchal Ex MLA KLR : టీపీసీసీ చీఫ్ ఎంపిక పూర్తయ్యింది. రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారో లేదో..అప్పుడే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన కాసేపటికే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనా చేయడం విశేషం. 2021, జూన్ 26వ తేదీ శనివారం దళిత ఆవేదన దీక్ష ఏర్పాటు చేసింది కాంగ్రెస్. దీనికి సంబంధించిన ఏర్పాట్లను లక్ష్మణ్ చూసుకున్నారు. భారీగా ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం హడావుడి చేసిన ఈయన..సాయంత్రం రాజీనామా చేయడం గమనార్హం.
టీపీసీసీ చీఫ్ ఎంపికను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో రేవంత్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గాంధీ భవన్ వద్ద బాణాసంచా కాలుస్తూ..స్వీట్లు పంచుకున్నారు. అయితే..రేవంత్ రెడ్డిని మొదటి నుంచి కొంతమంది వ్యతిరేకిస్తూ..వచ్చారు. ఆయన వైపే హై కమాండ్ మొగ్గు చూపడంతో సీనియర్ నేతలు అసంతృప్తులకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే..వీరిని బుజ్జగించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ గా ప్రకటించిన అనంతరం సీనియర్ నేతల నివాసాలకు వెళ్లారు రేవంత్ రెడ్డి. అందరినీ కలుపుకపోతానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు రేవంత్. అయితే..వ్యతిరేకిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తుందోనన్న టెన్షన్ పార్టీలో నెలకొంది. ఇంకెవరైనా రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతారా ? లేదా ? అనేది చూడాలి.