Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వాడాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు
కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న వారు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Corona Medicines
Corona Medicines : కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్న వాళ్లు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అసలు, ఏ మందులు వాడాలి? ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి? రోజుకు ఎన్ని ట్యాబెట్లు వేసుకోవాలి? చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయి. దీని గురించి సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్నారు. వాడాల్సిన మందుల గురించి ఎవరిని అడగాలో తెలియక, సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది.
Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి
కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్న వారు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఏ మందులు వాడాలి? రోజుకు ఎన్ని తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? అనే దానిపై పలు సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వల్ల ఈ తాజా సమాచారం గమనించాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’
అజిత్రోమైసిన్(Azithromycin) ట్యాబ్లెట్.. ఉదయం ఒకటి.. 5 రోజుల కోర్సు
పారాసెటమాల్(Paracetamol).. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి.. 5 రోజులు
లెవోసెటిరిజైన్(Levocetirizine).. రాత్రి ఒకటి… 5 రోజులు
రానిటిడైన్(Ranitidine)..ఉదయం ఒకటి.. 5 రోజులు
విటమిన్ సి ట్యాబ్లెట్లు.. ఉదయం ఒకటి.. 5 రోజులు
మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు.. ఉదయం ఒకటి.. 5 రోజులు
విటమిన్-డి.. ఉదయం ఒకటి.. 5 రోజులు
అయితే, కరోనా విషయంలో సొంత వైద్యం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరించారు. ఇష్టానుసారంగా మెడిసిన్స్ తీసుకోవద్దన్నారు. మందుల విషయంలో కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలని, వారి సలహాలు సూచనల మేరకు మెడిసిన్ తీసుకోవాలని సూచించారు. అలాగే లక్షణాలు తీవ్రంగా ఉన్నా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అపోహలు వీడి ధైర్యంగా ఉండాలని, డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే కరోనాను సులభంగా జయించవచ్చని భరోసా ఇచ్చారు.
దయచేసి గమనించండి!
ఇంటి వద్ద ఐసోలేశన్ లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు ?#COVID19 pic.twitter.com/ykt2r0aFzT
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) January 18, 2022