Hyderabad Rain Alert : రాబోయే 3 గంటల్లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి.. నగరవాసులకు అలర్ట్..!

Hyderabad Rain Alert : రాబోయే మూడు గంటల పాటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Hyderabad Rain Alert : రాబోయే 3 గంటల్లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి.. నగరవాసులకు అలర్ట్..!

Meteorological Center issues alert ( Image Source : Google )

Updated On : July 6, 2024 / 7:14 PM IST

Hyderabad Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం (జూలై 6)న హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ప్రజా భవన్.. బేగంపేట ఏరియాలో భారీగా వర్షం పడుతోంది. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.

Read Also : Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!

అంతేకాదు.. ఈ సాయంత్రం నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాబోయే మూడు గంటల పాటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విస్తరిస్తున్న మబ్బుల కారణంగా జీహెచ్ఎంసీ ఏరియాలో వర్షం కురుస్తుందని ముందుస్తుగానే వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడాయని, ఉరుములు మెరుపులతో కూడి ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలను హెచ్చరించింది.

శుక్రవారం (జూలై 5) సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వనస్థలిపురం, నాగోల్, ఉప్పల్, బేగంపేట, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట ప్రాంతాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

Read Also : Heavy Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు