Asaduddin Owaisi : పెట్రోల్ బంకుల బంద్‌పై ఓవైసీ సీరియస్.. మా పండుగలకే ఎందుకిలా అని పోలీసులపై ఆగ్రహం

హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల బంద్ పై సీరియస్ అయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పై ఆయన మండిపడ్డారు. తమ పండుగలకే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారని, ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ను ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ.

Asaduddin Owaisi : పెట్రోల్ బంకుల బంద్‌పై ఓవైసీ సీరియస్.. మా పండుగలకే ఎందుకిలా అని పోలీసులపై ఆగ్రహం

Updated On : October 9, 2022 / 7:47 PM IST

Asaduddin Owaisi : హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల బంద్ పై సీరియస్ అయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పై ఆయన మండిపడ్డారు. తమ పండుగలకే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారని, ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ను ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ.

నువ్వు, నేను చదువుకున్నది నిజాం కాలేజీలోనే. కానీ, ఇలాంటి నిర్ణయాల వల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని సీవీ ఆనంద్ సూటిగా ప్రశ్నించారు అసద్. మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా నగరంలోని ముస్లింలు ఉన్న ప్రాంతాల్లోని పెట్రోల్ పంపులు బంద్ చేయడంపై ఓవైసీ మండిపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”హైదరాబాద్ పోలీసులు రాత్రంతా పెట్రోల్ పంపులు బంద్ చేయించారు. ఎందుకు చేయించారో నాకు తెలియదు. నేను, పోలీస్ కమిషనర్ ఇద్దరూ నిజాం కాలేజీలో చదువుకున్నాం. ఆయనకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మోటార్ సైకిల్ నడపాలంటే పెట్రోల్ అవసరం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. మా పండుగలకే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదు? అన్ని పండుగలకు ఇలానే పెట్రోల్ బంకులు బంద్ చేయండి. అప్పుడు నేను మీకు ఎటువంటి ఫిర్యాదు చేయను” అని అసదుద్దీన్ అన్నారు.