Harish rao: తెలంగాణ అంటే దేశానికే ధాన్యాగారం – మంత్రి హరీశ్
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణలో పండుతోన్న పంటలు, రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి ప్రసంగించారు. మిరుదొడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సత్యనారాయణను ఎంచుకున్న సందర్భంగా..

Harish Rao
Harish Rao: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణలో పండుతోన్న పంటలు, రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి ప్రసంగించారు. మిరుదొడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సత్యనారాయణను ఎంచుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హరీశ్ రావు హాజరయ్యారు.
తెలంగాణ అంటే.. ఒకప్పుడు కరువు కాటకాలు కనిపించేవి ఇప్పుడు దేశానికే ధాన్యగారంగా మారింది. కూడవెల్లి పారుతుందని కలలో కూడా అనుకోలేదు. అలాంటి ప్రాంతంలో సీఎం కేసీఆర్ నీళ్లు పారించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్ల పాలనలో గుక్కెడు తాగు నీరు అయినా ఇవ్వలేకపోయాయి.
యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ధాన్యగారంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. కరోనా మూలంగా కార్మికుల కొరత, సంచుల కొరత.. ఏర్పడినా అధిగమింగలిగాం. సాగు నీటి వసతి మూలంగా తెలంగాణలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి.
నాట్లు వేయడానికి బీహార్ నుంచి.. డైరీ పామ్‌లో పాలు పిండటానికి పక్క రాష్ట్రాలోళ్లు వస్తున్నారని చెబుతున్నారు. మిరుదొడ్డిలో 5వేల 600 మంది రైతుల నుండి 56 కోట్ల ధాన్యం సేకరించాం.
ఉట్టిగానే ఇన్ని పంటలు పండాయా.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుకుంటలు బాగు చేశాం. 24 గంటల కరెంట్, రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సహాయం వంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.
దుబ్బాక నియోజకవర్గంలో మరో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న SC, STల కమ్యూనిటీ హాల్ పనుల కోసం నిధులు విడుదల చేస్తాం.
బుధవారం 32 లక్షల మంది రైతులకు 1600 కోట్ల రైతు బంధు డబ్బులు వేశాం. వడ్డీ వ్యాపారుల బెడద పోయింది. రైతులు మారాలి. పామాయిల్ పంటలను సాగు చేయాలి. ప్రభుత్వం అందిస్తోన్న సహకారం, సబ్సిడీ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి..
మిరుదొడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కార్యకర్త అయిన సత్యనారాయణకు అవకాశం ఇచ్చాం. ఒక రోజు ఆలస్యమైనా అందరికి న్యాయం అందేలా చూస్తామన్నారు మంత్రి హరీశ్.