Minister Harish Rao : పట్నం మాణిక్యానికి మంత్రి హరీశ్ రావు బుజ్జగింపులు

సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పట్నం మాణిక్యంతో మంత్రి హరీశ్ రావు మాట్లాడి బుజ్జగించారు.

Minister Harish Rao : పట్నం మాణిక్యానికి మంత్రి హరీశ్ రావు బుజ్జగింపులు

Updated On : October 24, 2023 / 3:25 PM IST

Minister Harish Rao-Patnam Manikyam : తెలంగాణలో ఎన్నికలు ఆయా నేతలు సీట్లు ఆశించి భంగపడి పార్టీలు మారుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన పట్నం మాణిఖ్యం అలకబూనారు. దీంతో మంత్రి హరీశ్ రావు ఆయన అలక తీర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. పట్నం మాణిక్యం ఇంటికి వచ్చి మాట్లాడారు హరీష్ రావు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని బుజ్జగింపులు జరిపారు. ఆయన ఇంటికి వచ్చిన హరీశ్ రావు కేవలం మాట్లాడి బుజ్జగించి తనతో హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. దీంతో ఆయన అలక తగ్గినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి అసెంబ్లీ సీటును ఆశించిన పట్నం మాణిక్యం ఆ సీటును బీఆర్ఎస్ అధిష్టానం చింతా ప్రభాకర్ కు కేటాయించింది. దీంతో సీటు ఆశించిన మాణిక్యంను మంత్రి హరీశ్ రావు మాట్లాడి బుజ్జగించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు..పార్టీ అదేశానికి కట్టుబడి చింతా ప్రభాకర్ కు అండగా ఉంటామని మాణిక్యం భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ సారి సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ పట్నం మాణిక్యం, ఆయన అనుచరులను కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అని అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్ ను ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారని అన్నారు. ఓటుకు నోటు – నోటుకు సీటు అనే వాళ్ళు కాంగ్రెస్ అంటూ విమర్శించారు.

Amit Shah-Pawan Kalyan : తెలంగాణకు వస్తున్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే అవకాశం..పొత్తులు,సీట్లపై క్లారిటీ వచ్చేనా..?

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృధి చేస్తారు..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం కెసిఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు.కర్ణాటక రైతులు తమ ప్రభుత్వాలను తిట్టుకుంటున్నారని తెలంగాణలో ఉన్న పథకాలు కర్ణాటకలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మతం మంటలు అనేది కాంగ్రెస్ చరిత్ర అంటూ విమర్శించారు. దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని తెలిపారు.

ధరణి వద్దు అని కాంగ్రెస్ అంటోంది అంటే పటేల్ పట్వారీ వ్యవస్థు తెస్తారా..?అంటూ ప్రశ్నించారు. దరణిలో లోపాలు ఉంటే సరి చేస్తాం అని తెలిపారు. రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడు అంటున్నారు..ఇప్పుడు మేం చేసేంది కంప్యూటరీకరణ కాదా..? అని ప్రశ్నించారు.

Puvvada And Ponguleti : పువ్వాడ, పొంగులేటిపై ఘాటైన వ్యాఖ్యలతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల