Puvvada And Ponguleti : పువ్వాడ, పొంగులేటిపై ఘాటైన వ్యాఖ్యలతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. కాంగ్రెస్ కు సేవచేసిన వారిని కాదని, పొంగులేటి తన అనుచరులకు సీటు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు.

Puvvada And Ponguleti : పువ్వాడ, పొంగులేటిపై ఘాటైన వ్యాఖ్యలతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల

Puvvada And Ponguleti

Updated On : October 24, 2023 / 11:59 AM IST

Maoist Party Central Committee Member Azad : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడిరాజుకుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమతమ పార్టీల గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలపై మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను విడుదల చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులేనని, వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని లేఖలో ఆజాద్ పేర్కొన్నాడు.

Also Read : Jagga Reddy : ఎన్ని కుట్రలు చేసినా నేనే సీఎం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పొంగులేటి, పువ్వాడ ఇద్దరూ అక్రమ మార్గంలో కోట్లు సంపాదించారు. ప్రస్తుతం వీరి దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలు కావాలంటే ఇద్దరికి అధికారం అవసరం. అవినీతి డబ్బుతో అందలం ఎక్కేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ కు సేవచేసిన వారిని కాదని, పొంగులేటి తన అనుచరులకు సీటు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు. ఆజాద్ విడుదల చేసిన లేఖ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కలకలంగా మారింది.