Minister jagadish reddy : కాంగ్రెస్ రద్దుల పార్టీ .. అందుకే రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు : మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ చేసే కుట్రలకు ప్రజలు బుద్దిచెప్పాలని మంత్రి జగదీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుందని అన్నారు.

Minister jagadish reddy : కాంగ్రెస్ రద్దుల పార్టీ .. అందుకే రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు : మంత్రి జగదీష్ రెడ్డి

Minister Jagdish Reddy

Minister jagadish reddy Fire On Congress : రైతు బంధు నిలిపివేయాలనటం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అంటూ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో మంత్రి మాట్లాడుతు.. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయటం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ రద్దుల పార్టీ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఉద్యమించాని.. తిరగబడాలని..గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.రైతు బంధు నిలివేయాలంటారు. ఉచిత విద్యుత్ అవసరం లేదంటారు.. మిషన్ భగీరదా కూడా ఆపేలని అనేలా కాంగ్రెస్ తీరు ఉంది అంటూ మండిపడ్డారు.

కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ చేసే కుట్రలకు ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుందని అన్నారు.కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. అని..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు ..కానీ తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది అంటూ విమర్శించారు.

Harish Rao : రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ కు రైతులే బుద్ధి చెప్పాలి : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ , బీజేపీ లు పోటీచేసే అభ్యర్ధులను ఇచ్చి పుచ్చుకుంటున్నారు అంటూ ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయకుండా చేయాలని కాంగ్రెస్,బీజేపీ లు కుట్ర చేస్తున్నాయని..ప్రజల కోసంపనిచేసే పార్టీని గుర్తించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చేసిందని విమర్శించారు.బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చెందంగా దేశప్రజల పరిస్థితి మారిందని అటువంటి అవకాశం తెలంగాణలో ఇవ్వకూడదన్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బిజేపికి అసలు అభ్యర్థులే లేరు అంటూ ఎద్దేవా చేశారు. రైతు బంధు ఆపివేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయటంతో కాంగ్రెస్ కుట్ర ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ చూపించేందు కపట ప్రేమ అని..రైతు బంధుపై ఈసీకి ఫిర్యాదు చేయయటంతో ఆ కపట ప్రేమ బట్టబయలైందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.