America : లాస్ ఏంజిల్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా తదితర రంగాల కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే

KTR America tour
Minister KTR Tour : మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతోంది.తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. కాసపటి క్రితం లాస్‌ఏంజిల్స్ చేరుకున్నారు. అక్కడ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని వారికి వివరించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ తో పాటు అధికార బృందం కూడా ఉంది. లాస్‌ఏంజిల్స్, శాన్‌డియాగో, శాన్‌జోస్, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. ప్రముఖ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరుపనుంది.
Read More : KTR America Tour : తెలంగాణలో పెట్టుబడుల కోసం కేటీఆర్ అమెరికా టూర్
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా తదితర రంగాల కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనుంది మంత్రి కేటీఆర్ బృందం. అమెరికాకు వెళ్లిన బృందంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్ గవార్, ప్రమోషన్స్ విభాగం డైరెక్టర్ రంగినేని విజయ్, డిజిటల్ మీడియా ముఖ్య సంబంధాల అధికారి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులున్నారు. అమెరికన్ సంస్థల నుంచి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినట్లు అంచనా.
Read More :KTR : ప్రధాని మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్… తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు
భారత్ బయోటెక్‌తో పాటు పలు ఫార్మా కంపెనీల్లో అమెరికన్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్, గోల్డ్‌మాన్‌సాక్స్, మాస్‌మ్యూచువల్ తదితర కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. యూఎస్ కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్‌కు వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తుడగా ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌లో అపాచీ హెలీకాప్టర్ల విడిభాగాలను టాటా ఏరోస్పేస్ ఉత్పత్తి చేస్తోంది. యూఎస్‌కు చెందిన బోయింగ్ జాయింట్ వెంచర్ టాటా ఏరోస్పేస్‌తో కలిసి ఎఫ్-16 విమానాల వింగ్స్‌తో పాటు సీ-130 కార్గో విడిభాగాలను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తోంది.