KTR : ప్రధాని మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్… తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు

దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..

KTR : ప్రధాని మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్… తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు

Ktr

Updated On : February 14, 2022 / 10:53 AM IST

KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు గుస్సా అవుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

రాష్ట్ర విభజన తీరుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నరేంద్రమోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అడ్డగోలుగా మాట్లాడారని కేటీఆర్ మండిపడ్డారు.

Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…

కర్నాటక రాష్ట్రంలో కలకలం రేపిన హిజాబ్‌ వివాదంపైనా కేటీఆర్‌ స్పందించారు. హిజాబ్‌ అంశం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగించిందని ట్వీట్ చేశారు. ఈ వివాదం వెనుక అసలు వ్యూహం ఏంటో అందరికీ తెలిసిందేనని అన్నారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని హడావుడిగా విభజించారని.. కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గు పడే విధంగా విభజించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే విభజన ప్రక్రియ చేసేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియ సరిగా లేని కారణంగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన విద్వేషం ఈరోజుకి కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతోందని ప్రధాని మోదీ వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాలేకపోయిందన్నారు ప్రధాని మోదీ.