Telangana assembly session: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశాలు.. ఈటల, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ గురువారం ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇతర పార్టీలకు చెందిన పలువురి నేతలతో మంత్రి కేటీఆర్ సరదా ముచ్చట్లు పెట్టారు.

KTR and Jaggareddy
Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సభలు, సమావేశాల్లో ఒకరిపై ఒకరు మాటల దాడిచేసుకొనే నేతలు అసెంబ్లీ లాబీలో సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు ఈటల, కేటీఆర్ సరదాగా ముచ్చట్లు పెట్టారు.
Minister Mallareddy: ఐటీ అధికారులు డబ్బున్న గదినే చూడలేదు.. ఆ డబ్బులే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న..
కేటీఆర్, జగ్గారెడ్డి సరదా సంభాషణ..
మరోవైపు మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్యకూడా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసితిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ పలుకరించారు. దీంతో టీ షర్ట్ తో అసెంబ్లీ వస్తే పిల్లలేనా అంటూ జగ్గారెడ్డి బదులిచ్చారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉన్నారు. దీంతో.. మీ ఇద్దరికి దోస్తాన్ ఎక్కడ కుదిరింది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మాది ఒకే కంచం, ఒకే మంచం అంటూ మామిళ్ల బదులిచ్చారు. అయితే, జగ్గారెడ్డిని గెలిపిస్తవ అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గలిపిస్త.. మన దగ్గరకు పట్టుకొస్త అంటూ మామిళ్ల రాజేందర్ సరదాగా వ్యాఖ్యానించారు.
Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ ..
అసెంబ్లీలో మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.. ఆర్టీసీ ప్రభుత్వపరం, రుణమాఫీ, పోడు భూములు, వీఆర్‌ఏల నిర్ణయం ఇలా వరుసగా ప్రతిపక్షాలకు మాస్టర్ స్టోక్ వచ్చిందని అన్నారు. దెబ్బల మీద దెబ్బ కొట్టడం వల్ల విపక్షాలు తట్టుకోవడం లేదు. కీలక నిర్ణయాలవల్ల ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రతిపక్షాల వాయిస్ డౌన్ అయింది అంటూ హరీష్ రావు అన్నారు. వరుస నిర్ణయాల వల్ల విపక్షాలకు వాయిస్ లేకుండా పోయింది. బయటే కాదు, అసెంబ్లీ లోపల కూడా విపక్షాలను కడిగేస్తాం అంటూ హరీష్ రావు మీడియాతో చిట్ చాట్‌లో అన్నారు.
మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ ..
అసెంబ్లీ లాబీలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే. గత ఎన్నికల్లో కేఎల్ఆర్ కు టికెట్ ఇప్పించింది నేనే అంటూ వ్యాఖ్యానించారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూప్ గొడవలు మేము సృష్టిస్తున్నాం. మా మనుషులను హరివర్దన్ వర్గం కార్యకర్తలుగా పంపి కేఎల్‌ఆర్‌ను నిలదీస్తాం అంటూ మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్న అని మల్లారెడ్డి అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..
నల్గొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయి. అన్ని నియోజకవర్గాల్లో కొత్తపాత వరదలు కలుస్తాయి. పార్టీ అధ్యక్షులనే మార్చినామనే ప్రచారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం పెద్ద కష్టమా. అభ్యర్థులు గెలువలేని పార్టీల్లో రాజకీయ గొడవలు ఉన్నప్పుడు.. అధికార పార్టీలో అభ్యర్థుల గొడవలు ఉండవా? పార్టీలో అంతర్గత కలహాలు అనేది సహజం. కొత్తపాత కలుపుకొని వెళ్లాల్సి ఉంది అంటూ మంత్రి జగ్గారెడ్డి అన్నారు.