Minister KTR: యూకేలో తెలంగాణ యువతి మృతి.. మృతుల కుటుంబ సభ్యుల అభ్యర్థనకు స్పందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌కు చెందిన సాయి తేజస్వీ యూకేలో చదువుకుంటూ బీచ్‌లో జరిగిన ప్రమాదంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతురాలి సోదరి ప్రియారెడ్డి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు మంత్రి స్పందించి రిప్లే ఇచ్చారు.

Minister KTR: యూకేలో తెలంగాణ యువతి మృతి.. మృతుల కుటుంబ సభ్యుల అభ్యర్థనకు స్పందించిన మంత్రి కేటీఆర్

Sai Tejaswi Kamareddy (File Photo)

Updated On : April 18, 2023 / 11:48 AM IST

Minister KTR: హైదరాబాద్‌కు చెందిన సాయి తేజస్వీ యూకేలోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్, స్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఏప్రిల్ 11న ఆమె బ్రైటన్ బీచ్‌లో గల్లంతైంది. అక్కడి అధికారులు తేజస్వీ మృతదేహాన్ని యూకేలోని ఆస్పత్రిలో ఉంచారు. అయితే, ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Harish Rao : సిద్దిపేట బీఆర్‌ఎస్ సభలో హరీశ్‌కు సోది చెప్పిన చిన్నారి మైత్రి

ఈ క్రమంలో మృతురాలి సోదరి ప్రియారెడ్డి మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది. ‘తన అక్క యూకేలో మరణించిందని, ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మా కుటుంబం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని పేర్కొంది. దయచేసి తన సోదరి అంత్యక్రియలు స్థానికంగా చేసేందుకు సహాయం చేయండి అంటూ ట్వీట్ చేసింది’.

KTR : మంత్రి కేటీఆర్ స్వీట్ మెమరీస్.. చిన్ననాటి ఫోటో వైరల్

ప్రియారెడ్డి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. మీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాము. నా బృందం వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ బృందంతో కలిసి పనిచేస్తుంది. వీలైనంత త్వరగా మీకు సహాయం అందిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే తేజస్వీ బంధువు ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ.. సాయి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం చాలా కష్టమైన ప్రక్రియ అని, ఆర్థికంగా సవాలు ఉందని అన్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆర్థిక సహాయం కోరుతున్నామని, ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించామని తెలిపారు.

 

 

యూకే నుంచి ఆమె మృతదేహాన్ని ఇండియాకు తరలించాలంటే చాలా సవాల్‌తో కూడుకున్న పక్రియ అని, ఆర్థికంగా భరించే స్థోమత కలిగి ఉండాలని అన్నారు. ఇందుకోసం ఇరవైవేల ఫౌండ్ల అవసరం కాగా gofund.me పేజీని ప్రారంభించి ఆర్థిక సాయం కోరుతున్నట్లు తెలిపారు. ఇది 19వేల ఫౌండ్లకు పైగా అందుకుంటుందని చెప్పారు. తేజస్వీ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ఖర్చులను భరించేందుకు మేము ఇప్పుడు మీ మద్దతును కోరుతున్నామని ప్రదీప్ అన్నాడు.