Minister KTR : మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తన కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.

Minister KTR : మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్

Minister Ktr

Updated On : November 18, 2021 / 7:04 AM IST

Minister KTR : మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. హకీంపేట వద్ద మియాపూర్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.. అదే సమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న కేటీఆర్ గాయపడిన విద్యార్థులను గమనించి వెంటనే కాన్వాయ్‌ ఆపాడు. ఆ తర్వాత విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రమాద విషయం తెలుసుకొని వెంటనే తన ఎస్కార్ట్ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. సిబ్బందితో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి ప్రమాద విషయం తెలిపారు.

చదవండి : KTR : కేసీఆర్ మాట వినండి.. లేదంటే నష్టపోతారు..

మంత్రి కేటీఆర్ పేదలకు సాయం చేయడంలో ముందుంటారన్న విషయం తెలిసిందే.. సాయంకోరి వచ్చిన వారికి తనవంతుగా సాయం చేస్తుంటారు కేటీఆర్. ట్విట్టర్ ద్వారా తమ కష్టాలు చెప్పుకున్న ఎంతోమందికి అండగా నిలిచారు మంత్రి. తాజాగా ఇద్దరు విద్యార్థుల పైచదువులు కోసం డబ్బు అందించారు. మరో విద్యావంతురాలికి ఉద్యోగం ఇప్పించారు.. ఇలా ప్రతి రోజు ఎదో ఒక సాయం చేస్తూనే ఉంటారు కేటీఆర్.

చదవండి : KTR – Sudheerbabu: కేటీఆర్ మంచి లీడరే కాదు.. మంచి యాక్టర్ కూడా..!