ORR LED Lights : ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు‌లో హెచ్.యం.డి.ఏ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు

ORR LED Lights : ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించనున్న కేటీఆర్

ORR LED Lighting

Updated On : December 15, 2021 / 9:46 PM IST

ORR LED Lights : హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు‌లో హెచ్.యం.డి.ఏ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.  ఓఆర్ఆర్ పై నాలుగు ప్యాకేజిలలో రూ.100.22 కోట్లతో 136 కిలో మీటర్ల మేర ఈ లైట్లు ఏర్పాటు చేశారు.

వీటిని 136 కిలో మీటర్లలలో ఉన్న జంక్షన్ లు, అండర్ పాస్లు, రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లలో ఒక కిలో మీటర్ మేర ఎల్‌ఈ‌డి లను ఏర్పాటు చేశారు. వీటి వలన చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.

Also Read : PM Modi : బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ

ఇందులో 6,340 పోల్స్,13,392 ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ మధ్య 22 కిలో మీటర్ల మేర రూ.30 కోట్లతో 2018 లో ఎల్ఈడి  లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఓఆర్ఆర్ లోని   158 కిలో మీటర్ల మేర ఎల్ఈడి లైట్లు వెలుగనున్నాయి.