Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి.. సిబ్బందికి కీలక ఆదేశాలు
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

NTR Ghat
Nara Lokesh: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం ఘనంగా నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు.. ఏపీ మంత్రి నారా లోకేశ్ తన తల్లి భువనేశ్వరితో కలిసి వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణలో లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని లోకేశ్ ఆదేశించారు.
Also Read: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. మనోజ్‌కు నోటీసులు
ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు మంత్రి లోకేశ్ వచ్చారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్ లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని లోకేశ్ గమనించారు. అయితే, ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండీఏ తీరుపట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాట్ నిర్వహణ ఎన్టీఆర్ ట్రస్ట్ కు అప్పగించాలని గతంలో పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
తాజాగా.. ఘాట్ వద్ద నిర్వహణ లోపం ఉండటంతో అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా సొంత నిధులతో ఘాట్ మరమత్తులు పూర్తి చెయ్యాలని లోకేశ్ నిర్ణయించారు. వెంటనే పనులు ప్రారంభించాలని తన సిబ్బందిని లోకేశ్ ఆదేశించారు.