నా పదవికి రాజీనామా చేస్తా..!- కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్..

రేపు ఉదయం ఏ ప్లేస్ కి, ఏ టైమ్ కి రావాలో మీరు చెబితే తప్పకుండా.. నేను వస్తా.

నా పదవికి రాజీనామా చేస్తా..!- కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్..

Minister Ponguleti Challenge Ktr (Photo Credit : Facebook)

Updated On : September 21, 2024 / 9:05 PM IST

Ponguleti Srinivas Reddy : మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. అమృత పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించలేకపోతే కేటీఆర్ రిజైన్ చేయాలని చాలెంజ్ చేశారు. ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పిన మంత్రి పొంగులేటి.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లెటర్ తో వస్తానని వెల్లడించారు. నా సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధమేనా? అని కేటీఆర్ ను అడిగారు మంత్రి పొంగులేటి.

”కేటీఆర్ నాపై అభియోగం చేశారు. నేను మరోసారి సవాల్ విసురుతున్నా. 8వేల 888 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని మీరు అన్నారు. 8వేల 800 కోట్లకు టెండర్లు వేసినట్లుంటే.. మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇదే నా చాలెంజ్. నా సవాల్ ని స్వీకరించినట్లైతే.. రేపు ఉదయం ఏ ప్లేస్ కి, ఏ టైమ్ కి రావాలో మీరు చెబితే తప్పకుండా.. నేను వస్తా. మీ దగ్గరున్న ఆధారాలు మీరు తీసుకురండి. నా దగ్గరున్న ఆధారాలు నేను తెస్తా. మీది రుజువైతే కరెక్ట్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తా” అని కేటీఆర్ పై విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి.

Also Read : కాంగ్రెస్‍లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త రూల్..! ఇంతకీ పీసీసీ చీఫ్ ప్లాన్ ఏంటి?