మాది అటువంటి ప్రభుత్వం కాదు.. ఈ పని చేశాకే వచ్చి ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి స్పష్టం
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని చెప్పారు.

Ponguleti Srinivasa Redd
తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రకియ అని తెలిపారు.
ఒక్కసారి 3,500 ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వానికి నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టడానికి 22,500 కోట్ల రూపాయల అవసరమని తెలిపారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని చెప్పారు.
Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో ఆడడం అంత ఈజీ కాదు: గంగూలీ
వచ్చే మూడున్నరేళ్లలో తల తాకట్టు పెట్టైనా రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతామని అన్నారు. గత ప్రభుత్వం రెత్తుబంధును వాళ్ల పార్టీ వారికే ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం బాగోతం బయటపడుతుంది కాబట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కి దారి కోసం వాసాలమర్రి గ్రామాన్ని పాడుచేశారని ఆరోపించారు. ఇంకా పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిపారు.