విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో ఆడడం అంత ఈజీ కాదు: గంగూలీ

తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో ఆడడం అంత ఈజీ కాదు: గంగూలీ

Updated On : June 22, 2025 / 6:57 PM IST

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ వన్డేల్లో మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించారు. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో వీరు ఆడాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.

అయితే, ఇది అంత ఈజీ కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటున్నారు. క్రికెట్‌లో ఒక్క ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతూ ఫామ్ నిలుపుకోవడం సులభం కాదని తెలిపారు. ప్రస్తుతం భారత జట్టు తదుపరి వరల్డ్‌కప్‌కి ముందు మొత్తం 27 వన్డేలు ఆడనుంది. వీటిల్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచుల్లో ఆడేలా కోహ్లీ, రోహిత్ ప్రయత్నిస్తారు.

Also Read: అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ ఏదో తెలుసా? జుపిటర్, ఓలా కాదు..

తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇది సులభం కాదు. ఏడాదికి 15 మ్యాచ్‌లు ఉంటాయి. వారికి నేను ఇచ్చే సలహా ఏమీ లేదు. వాళ్లకూ ఆటపై నాకు ఉన్నంత అవగాహన ఉంది. వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. కానీ అందరూ గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా క్రికెట్‌ వీరిని వదిలిపెడుతుంది, వీరూ క్రికెట్‌ను వదిలిపెడతారు’’ అని అన్నారు.

రోహిత్, కోహ్లీ ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025లో ఆడిన విషయం తెలిసిందే, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు వారిద్దరు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. కాగా, వన్డేల్లో రోహిత్, కోహ్లీ అద్భుతంగా రాణించారు. 2023 నుంచి రోహిత్ 48.97 సగటుతో, 117.2 స్ట్రైక్‌రేట్‌తో 1,714 పరుగులు చేశాడు. కోహ్లీ 61.07 సగటుతో, 95.8 స్ట్రైక్‌రేట్‌తో 1,710 పరుగులు చేశాడు.