Puvvada Ajay kumar : ఆ రోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా : మంత్రి పువ్వాడ

అక్కడ నా అవసరం తీరినరోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా అంటూ మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Puvvada Ajay kumar : ఆ రోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా : మంత్రి పువ్వాడ

puvvada ajay kumar

Updated On : June 16, 2023 / 3:46 PM IST

TS minister puvvada ajay kumar : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (minister puvvada ajay kumar)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మనికి నా అవసరం తీరిన రోజు మాత్రమే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని వ్యాఖ్యానించారు. ఖమ్మం పట్టణ ప్రగతి (Khammam urban progress)లో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం(Corporation Office)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక

అనేక మంది అడ్డంకులు సృష్టించారని..వాటిని అధిగమించి అభివద్ధి చేశామని అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కారణం మంత్రి కేటీఆర్ అని అన్నారు.రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ (KTR) అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress)బీజేపీ(BJP) పార్టీలు దమ్ముంటే వారి సీఎం అభ్యర్థి (CM candidate)పేరు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (Khammam Municipal Corporation)అవినీతి రహిత కార్పొరేషన్ గా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ తెలిపారు. ఐఏఎస్ పరిపాలన వచ్చిన తర్వాతనే ఖమ్మం అభివృద్ధి చెందిందనీ..రాబోయే రోజుల్లో 23 కిలోమీటర్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(Underground drainage)ని నిర్మించనున్నామని తెలిపారు.