Minister Sabita Indrareddy : మన ఊరు-మన బడికి కేంద్రం నిధులు ఎక్కడిచ్చిందో నిరూపించాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు.

Sabita Indrareddy
Minister Sabita Indrareddy : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ మన ఊరు-మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు..రూ.2700 కోట్లు ఎక్కడ ఇచ్చారో నిరూపించాలన్నారు. ఇస్తే ఆ నిధులు ఎక్కడి నుంచి డ్రా చేసుకోవాలో చెప్పాలన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా నిస్సిగ్గుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ బాద్యతగా మాట్లాడాలని సూచించారు. ఒక వైపు టెట్ ఎగ్జామ్ వాయిదా వేయాలి అంటారు..మరో వైపు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీలు చేయాలి అంటారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రయివేటు స్కూల్స్ లో ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేస్తోందని తెలిపారు. ఫీజుల నియంత్రణకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.