Seethakka: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Seethakka: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

Minister Seethakka

Updated On : October 23, 2024 / 2:58 PM IST

Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో సీతక్కకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Also Read: Priyanka Gandhi: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక భారీ రోడ్ షో.. బహిరంగ సభలో ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పని ఒత్తిడి వల్ల మొక్కులు చెల్లించుకోవడం ఆలస్యమైందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధించినట్లు తెలిపారు.