Srinivas Goud : గద్దర్ గుండెల్లో బుల్లెట్ ఎవరి హయాంలో దిగింది.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బిడ్డలను చంపింది నిజం కాదా?
కాంగ్రెస్ పార్టీ వాళ్లే రేవంత్ కు పిండం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో మాట్లాడినంత మాత్రన జాతీయ నాయకుడనుకుంటున్నారని చెప్పారు.

Srinivas Goud Fire Revanth Reddy
Srinivas Goud – Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. రేవంత్ పొగరుతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వార్తల్లో ఉండేందుకే రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ పై మాట్లాడే భాష ఇదేనా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
గద్దర్ కాంగ్రెస్ నాయకుడన్నట్లు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. గద్దర్ గుండెల్లో బుల్లెట్ ఎవరి హయాంలో దిగింది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బిడ్డలను చంపింది నిజం కాదా? అని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ ఆటలు సాగవన్నారు. వంద శాతం మూడో సారి కూడా వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ గాలిలో మేడలు కడుతున్నారని, పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లు ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లే రేవంత్ కు పిండం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో మాట్లాడినంత మాత్రన జాతీయ నాయకుడనుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల అని అన్నారు.