Minor Driving License: కొత్త రూల్స్.. అందరికీ 18 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్.. వీళ్లకి మాత్రం 25 వచ్చాకే..
Minor Driving License Rules : మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే 25ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కాదు. వాహన రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దు. రవాణా శాఖ కీలక హెచ్చరిక చేసింది.
Minor Driving Licence Rule
- మైనర్లు వాహనం నడిపితే భారీ మూల్యం..
- 25ఏళ్ల వరకు నోలైసెన్స్
- ఏడాది పాటు వాహన రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్!
Minor Driving License Rule : మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వారికి 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మైనర్లు నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లకు బైక్‌లు, కార్లు లేదా ఇతర వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ ఏడాది మైనర్లు వాహనాలు నడుపుతుండగా మొత్తం 4,070 వాహనాలను పట్టుకున్నామని, వాటి రిజిస్ట్రేషన్ లను ఏడాది పాటు రద్దు చేసినట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తం గా దీనిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, అందుకే మైనర్లు వాహనాలు నడపొద్దని, వారికి యజమానులు వెహికల్స్ ఇవ్వొద్దని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 199A ప్రకారం వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
